20-12-2025 01:03:23 AM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
మొయినాబాద్, డిసెంబర్ 19 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలభివృధి సాధ్యమని, అభివృద్ధి సంక్షేమ పనుల్లో అందరూ సహకారం అందించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే పరిశుభ్రత ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 90.40 లక్షల నిధులతో సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులందరికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృధి పనులను ప్రజలు గుర్తించి స్థానిక పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ధులను అధిక సంఖ్యలో గెలిపించారని అన్నారు. రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాచాటాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు షాబాద్ దర్శన్, పీఏసీఏస్ చైర్మన్ చంద్రారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లగోల్ల అశోక్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ఖజమోహిజుద్దీన్, కొత్త నరసింహరెడ్డి, కొత్త మాణిక్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సంధ్య శ్రీశైలం, వెంకట్ రెడ్డి, పట్నం రాంరెడ్డి, మక్బూల్, బేగరి రాజు, రాజగోపాల్ చారి, మడి మల్లారెడ్డి, కొండల్ రెడ్డి, మల్లారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, డేవిడ్, అంతంగారి నరసింహ, చెంగలి వెంకట్ రెడ్డి, కుమ్మరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.