20-12-2025 01:03:06 AM
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ డిసెంబర్ 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నజా వుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పాటు జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామా బాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేనికృషి చేశారన్నారు.