20 April, 2026 | 2:48 AM

అగ్రకులాల్లోని పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

20-04-2026 12:25 AM

ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ సుజాత

ఆదిలాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్యవైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా అన్నారు. ఆదిలాబాద్ నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య భవన్ ను మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష లతో కలిసి ఆమె ప్రారంభించారు.

ముందుగా ఉమామహేశ్వర ఆలయంలో అథితులు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంఘ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించిన నిర్వహకులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజాత గుప్తా మాట్లాడుతూ... పేద ఆర్యవైశ్యుల కోసం నిర్మించిన భవనానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో అప్పటి మంత్రి జోగు రామన్న ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

ఆర్యవైశ్యులంటే అపదలో ఉన్నవారికి అండగా నిలిచే వారని, మూడు కో నిర్మంచిన ఈ భవనానికి ప్రభుత్వాలతో పాటు పలువురు స్వచ్చందంగా సహురించడంతో భవనాన్ని పూర్తి చేసుకున్నామన్నారు. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ వెనకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే కాకుండా అగ్రకులాలైన బ్రహ్మణ, ఆర్యవైశ్య, రెడ్డి సామాజిక వర్గాలకు సైతం సొంత భవనాల నిర్మాణాలకు  కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

రాజకీయాలకు అతీతంగా వెనకబడిన ప్రజల అభివృధ్ధికి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జోగు శైలజ, మున్సిపల్ మాజీ చైర్మన్ రంగినేని మనిషా, ఆదిలాబాద్ డివిజన్ ఆత్మ చైర్మన్ సంతోష్, బీఆర్‌ఎస్ నాయకులు అజయ్. యాసం నర్సింగ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు రాజేశ్వర్ కొత్తవార్, జనగం సంతోష్, ప్రదీప్ కుమార్, బాశెట్టివార్ సంజయ్, జయసుధ, తదితరులు పాల్గొన్నారు.