10 June, 2026 | 9:07 PM

నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

06-11-2025 12:47 AM

బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, నవంబర్ 5 (విజయక్రాంతి ):  అకాల వర్షాలతో  రైతులకు తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం ఐకెపి సెంటర్లను జిల్లా బిజెపి నాయకుల తో కలిసి పరిశీలించారు.

ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల చొప్పున నష్టపరిహారం  ఇవ్వాలని  బోనస్ గా ఇస్తానన్న 500 రూపాయలు వెంటనే చెల్లించాలని బిజెపి శాసనసభ పక్ష నేత డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వెంటనే అమలు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి,  చంద మహేందర్,  మండల ఇంచార్జ్ జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, ఫకీర్ రాజేందర్ రెడ్డి , మండల ప్రధాన కార్యదర్శులు నాగు వినోద్ కుమార్, మాటూరి అనిల్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బబ్బూరి సురేష్ గౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పడమటి మాణిక్యం రెడ్డి,

మట్ట ఆంజనేయులు గౌడ్, కొత్తపెళ్లి చంద్రశేఖర్, భువనగిరి సిద్దు గౌడ్, బబ్బూరి శంకర్ గౌడ్,బూత్ అధ్యక్షులు ఎలకొండ రాజశేఖర్ రెడ్డి, రత్నపురం శ్రీకాంత్, సీనియర్ మండల నాయకులు, వల్లపు సతీష్, ఎలకొండ సుధాకర్ రెడ్డి,వల్లపు సురేష్, రసాల పుల్లయ్య, కంటం రాజమోహన్, కంటం నరేష్, కోలా శివ, దుర్గ, పిట్టల కిరణ్, రసాల సత్యనారాయణ, పొట్ట రాజశేఖర్ పాల్గొన్నారు.