calender_icon.png 6 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల పవిత్రతే మా ప్రథమ కర్తవ్యం

06-11-2025 12:48:47 AM

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): తిరుమల శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడి దానిని మరింత ఇనుమడిం పజేయడమే తమ బోర్డు ప్రథమ లక్ష్యమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మ న్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయి న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంలో ఆయన మీడి యా సమావేశం నిర్వహించి, గత ఏడాది కాలంలో చేపట్టిన కీలక సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

ఈ సంద ర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ  గతంతో పోలిస్తే తిరుమల అన్నప్రసాదాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నాం అని తెలిపారు. తిరుమలలో రోజూ 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారని ఆయన వెల్లడించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతను కూడా పెంచామని, ప్రస్తుతం లడ్డూలు పది రోజులైనా నిల్వ ఉంటున్నాయని భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. కాగా గత ఏడాదిగా బోర్డు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వివరించారు.

తిరుపతి స్థానికుల కోసం నెలకోసారి తొలి మంగళవారం మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాటేజీలకు దేవుళ్ల పేర్లు.. తిరుమల లోని కాటేజీలకు గతంలో వ్యక్తులు పెట్టుకున్న సొంత పేర్లను తొలగించి, వాటి స్థానం లో దేవదేవుడి పేర్లను పెట్టాలని బోర్డు నిర్ణయించిందని స్పష్టం చేశారు. స్విమ్స్ ఆధుని కీకరణ, తిరుపతిలోని స్విమ్స్ (శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) ఆసుపత్రి ఆధునికీకరణ కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.