18-11-2025 08:51:56 PM
విద్యార్థులలో ఉన్న ప్రతిభ వెలికి తీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి..
ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ లో రూ.44 లక్షలతో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవం..
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ లో రూ. 44 లక్షలతో నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్లాస్ రూమ్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ విద్య యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని ప్రేరణ కల్పించారు.
ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ, విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు జుక్కల్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలని, ప్రతీ స్కూల్లో సరిపడా ఉపాధ్యాయ సిబ్బంది, లేబోరేటరీస్, క్లాస్ రూమ్స్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా పని చేస్తున్నారని.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని దృఢ సంకల్పంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించారని ప్రతీ ఒక్క విద్యార్ధి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని పట్టుదలతో చదివి గమ్యాన్ని చేరుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ,పెద్ద కొడప్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చిప్ప మోహన్, శామప్ప పటేల్, కల్లూరి పండరి, అహ్మద్, బసవరాజ్ దేశాయ్, మొగుల గౌడ్, మల్లప్ప పటేల్, మండల యూత్ అధ్యక్షులు శ్రీనివాస్, బొమ్మల నాగరాజ్, సయ్యద్ ఫెరోజ్, మహమ్మద్ గౌస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు