calender_icon.png 18 November, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమావాస్యకి చెర్వుగట్టు దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు

18-11-2025 10:01:07 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ​రాబోయే అమావాస్య సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం ఈఓ మోహన్ బాబు తెలిపారు.​ ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ​భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రత్యేకించి శానిటేషన్ (పరిశుభ్రత), డ్రింకింగ్‌ వాటర్ (తాగునీరు), క్యూలైన్‌ నిర్వహణ వంటి అత్యవసర సేవలను మరింతగా మెరుగుపరుస్తున్నట్టు ఆయన వెల్లడించారు.​రానున్న రోజుల్లో దేవస్థాన అభివృద్ధి పథకాలపై వేగంగా పనిచేసి, ఆలయ ప్రతిష్ఠను మరింత పెంపొందిస్తామని తెలిపారు.​ అంతేకాక, దేవస్థానానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా స్వచ్ఛత పాటించాలని, ఒకరికొకరు ఇబ్బందులు కలగకుండా శాంతి-పరిపాలనకు సహకరించడం ప్రతి భక్తుడి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా సూచించారు.