18-11-2025 08:42:57 PM
సిద్దిపేట క్రైం: 'డ్రంక్ అండ్ డ్రైవ్'లో పట్టుబడిన 15 మందికి రూ.లక్ష 52 వేలు న్యాయమూర్తి జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులను బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా, 15 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతునట్లు నిర్ధారణ అయ్యింది. వారిపై కేసు నమోదు చేసి, మంగళవారం సిద్దిపేటలోని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి వారికి జరిమానా విధించారు.