18-11-2025 09:40:04 PM
ట్రాన్స్ఫార్మర్ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం.
తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తో బోయిని సైదులుకు చెందిన సుమారు రూ. 15వేల విలువైన మేక మృతి చెందింది. తుంగతుర్తి నుండి సూర్యాపేటకు వెళ్లే ఊరు బయట ప్రధాన రహదారిపై ట్రాన్స్ ఫార్మర్ రోడ్డు ప్రక్కన చాలా కిందికి ఉన్నందున మేక మేత కొరకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్ కు తలిగి మేక అక్కడికక్కడే చనిపోయిందని బాధితులు తెలియజేశారు. ప్రమాద సూచికలు, చుట్టూ కంచె లేకపోవడమే దీనికి కారణమని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని బాధితుడు ఆరోపించారు.
అదేవిధంగా మూగజీవాలు పశువులు, బర్రెలు, మనుషులకు కూడా తలిగే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ను రోడ్డుకు దూరంగా షిఫ్ట్ చేసి మూగజీవాలకు మనుషులకు అందనంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్ పెట్టి ముళ్ళ కంచె వేసి ప్రమాద సూచికలు పెట్టాలని గ్రామస్తులు అన్నారు. సంబంధిత అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు సైదులు కోరుతున్నారు.