calender_icon.png 18 November, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ ఆయిల్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు..

18-11-2025 08:47:55 PM

ఉప్పల్ (విజయక్రాంతి): పారాషూట్ కొబ్బరి నూనె పేరుతో నకిలీ ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్  ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్లో రాందేవ్ కిరాణా షాప్ లో నకిలీ కొబ్బరి నూనెతో పాటు నకిలీ హార్పిక్ విక్రయిస్తూ మోసం చేస్తున్నాడని సమాచార మేరకు ఎస్ఓటి, ఉప్పల్ పోలీసులు సంయుక్తంగా షాపుపైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ పారాషూట్ ఆయిల్ తో పాటు హార్పిక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపారు.