calender_icon.png 29 May, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

08-05-2025 12:00:00 AM

దౌల్తాబాద్, మే 7: అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం రామారం, గొల్లపల్లి, సయ్యద్ నగర్ గ్రామాల్లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను, ఐకెపి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు పూర్తయి చేతికందే సమయంలో ఇలా వడగండ్ల వాన కురిసి పంటలు నష్టపోవడం దురదృష్టకరమన్నారు.  గ్రామాలలో దెబ్బతిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడానని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తో మాట్లాడి రైతులకు నష్టపరహారం అందించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

అనంతరం రామారం గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్యకు రూ. 20 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్, దౌల్తాబాద్ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు నాయకులు కిష్టారెడ్డి, దుర్గ ప్రసాద్, మహేష్, స్వామి, నరేష్, శ్రీనివాస్, నర్సింలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.