08-05-2025 12:00:00 AM
దౌల్తాబాద్, మే 7: ఐదు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరానగర్ బీఆర్‌ఎస్ నాయకులు ఉప్పరి స్వామి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం వీరానగర్ గ్రామంలో మిషన్ భగీరథ నీరు రావడంలేదని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్చమైన త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందించడంలేదన్నారు. నీళ్లు రాకపోవడంతో వ్యవసాయ పొలాల నుండి ట్యాంకర్ల ద్వారా తీసుకు వస్తున్నామని అన్నారు.
ఐదు రోజుల నుండి గ్రామానికి నీళ్లు రావడంలేదని మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు గ్రామానికి గతంలో లాగే నీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరానగర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు..