14-11-2025 12:00:00 AM
వనపర్తి, క్రైమ్ నవంబర్ 13 : వనపర్తి సీసీఎస్ సీఐగా అశోక్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించడం కేవలం విధి కాదు, అది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని సీసీఎస్ విభాగం నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు .
ప్రతి దర్యాప్తులో వాస్తవాలను ఆధారంగా తీసుకుని పారదర్శకంగా, సమయపాలనతో వ్యవహరించాలన్నారు . ప్రజల విశ్వాసం పొందడం పోలీసు శాఖకు అత్యంత ముఖ్యమైనదన్నారు . అశోక్ కుమార్ ఇంతకు ముందు హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించి వనపర్తి జిల్లాకు బదిలీపై వచ్చి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.