18 April, 2026 | 6:01 AM

త్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేయాలి

07-06-2025 01:03 AM

పెబ్బేరు, జూన్ 6 : త్వరితగతిన ధాన్యం అన్లోడ్ చేయాలని సంబందించిన అధికారులను అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు మండలంలోని సప్తగిరి, సాయి గోపాల్ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని త్వరితగతిన అన్లోడ్ చేయాలని మిల్లు యజమానులను ఆదేశించారు. ధాన్యం అన్లోడ్లో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందిస్తూ, ఎక్కువ కోతలు (కటింగ్స్) లేకుండా, త్వరితగతిన ధాన్యాన్ని అన్లోడ్ చేయాలన్నారు .

తరుగు పేరుతో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దు‘ అని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర అందించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మిల్లు యజమానులపై ఉందన్నారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన మిల్లు యజమానులకు సూచించారు.