05-07-2025 01:16:06 AM
జిల్లా కలెక్టర్ దివాకర్
ఏటూరునాగారం,జూలై4(విజయక్రాంతి):ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం కరకట్టను,మంగపేటలోని పొడుమూరు కరకట్టను,వరద తీరాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించి గోదావరి ప్రభావం పెరిగిందాని,ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వరద కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, సకాలంలో నివాస గ్రామాలను ఖాళీ చేయాల్సిన అవసరం తలెత్తిన పక్షంలో తగిన చర్యలు తీసుకోవడానికి, గోదావరి నదిలో నీటి మట్టాన్ని నిరంతరం పై అధికారులకు నివేదించాలని సాగునీటి శాఖ,
ఎంపీడీఓ, తహసీల్దార్,సిబ్బందికి సూచించారు. అలాగే,ప్రమాదకర ప్రాంతాల్లో తగినంత ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు.గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుదలపై 24గంటలు అప్రమత్తంగా ఉండాలని,వరద సమయంలో సకాలంలో చర్యలు తీసుకోవడానికి కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ తెలిపారు.