10 May, 2026 | 1:23 AM

తల్లి ఒడిలో పసివాడు

10-05-2026 12:00 AM

అమ్మ కొంగుచాటు పసివాడు

ముసిముసి నవ్వుతో ముఖం

చాటేస్తూ అమ్మ కౌగిట్లోకి జారుకునే

రాజ కోటలో రాజులా రాజసం

ప్రదర్శిస్తూ అమ్మ ప్రేమను పొందే...

అమ్మ ఒడిలో పసివాడు లేత

పలుకులతో ఆడిపాడుతూ

అమ్మపై అమోఘమైన ప్రేమ

కురిపిస్తూ సంబుర పడుతుంటే

ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంలో తల్లి...

ఈ సృష్టిలో అమ్మ ప్రోత్సాహమే

విజయానికి నాంది పలికిన

సందర్భాలు నిత్య నూతనమే...

కష్ట సమయంలో 

అమ్మ ఆదరణ

కొండత మనోధైర్యాన్నిస్తుంది...

అపార మేధావైనా, 

ఢిల్లీకి రాజైనా

అమ్మ ఒడిలో పసివాడే అవుతాడు...

అమ్మ పిల్లలకు మంచి నడవడిక

నేర్పుతూ విజయతీరాలకు చేరుస్తుంది.తల్లి ఒడిలో పసివాడు

అమ్మ కొంగుచాటు పసివాడు

ముసిముసి నవ్వుతో ముఖం

చాటేస్తూ అమ్మ కౌగిట్లోకి జారుకునే

రాజ కోటలో రాజులా రాజసం

ప్రదర్శిస్తూ అమ్మ ప్రేమను పొందే...

అమ్మ ఒడిలో పసివాడు లేత

పలుకులతో ఆడిపాడుతూ

అమ్మపై అమోఘమైన ప్రేమ

కురిపిస్తూ సంబుర పడుతుంటే

ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంలో తల్లి...

ఈ సృష్టిలో అమ్మ ప్రోత్సాహమే

విజయానికి నాంది పలికిన

సందర్భాలు నిత్య నూతనమే...

కష్ట సమయంలో 

అమ్మ ఆదరణ

కొండత మనోధైర్యాన్నిస్తుంది...

అపార మేధావైనా, 

ఢిల్లీకి రాజైనా

అమ్మ ఒడిలో పసివాడే అవుతాడు...

అమ్మ పిల్లలకు మంచి నడవడిక

నేర్పుతూ విజయతీరాలకు చేరుస్తుంది.

మిద్దె సురేష్

9701209355