09-02-2026 12:04:22 AM
శ్రీరంగాపూర్ ఫిబ్రవరి 8: మండల కేంద్రంలోని శ్రీ ఆది బసవన్న ఆలయంలో ఆదివారం నాడు శివ స్వాముల ఇరుముడి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద మంత్రోచ్చారణల మధ్య అ భిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు హరహర మహాదేవ అంటూ నినాదాలు చేశా రు. అనంతరం శివ స్వాములు ఇరుముడి ధరించి ఆలయం చుట్టూ శోభాయాత్ర సాగి శ్రీరంగాపూర్ గ్రామం పరిసరాల వరకు సాగించి దేవదేవుడు శ్రీశైల మల్లికార్జున చెంతకు బయలు దేరా రు.
హరిహర శంభో శంకర అంటూ సాగిన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రా మ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు సదుపాయాలు కల్పించారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఆలయ కమిటీ అధ్య క్షులు ఆంజనేయులు గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంపొందించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.