16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

అయిజను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం

09-02-2026 12:03 AM

ఎంపి మల్లు రవి 

అయిజ ఫిబ్రవరి 8 అయిజ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి రోడ్డు షో నిర్వంచారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ గత పది ఏళ్ల కాలం నుంచి ఐజ అభివృద్ధి కుంటుపడిందని రోడ్ షో నిర్వహించిన సందర్భంగా గ్రహించింది ఏమిటంటే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని టిఆర్‌ఎస్ పాలనలో దళితుల చైర్మన్ గా ఉండి కూడా దళితవాడను నాశనం చేశారని అన్నారు.

డబ్బులకు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అయిజను అభివృద్ధి చేసుకుందామని అవసరమైతే అయిజను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని అన్నారు. అధికారంలో లేని పార్టీలకు ఓట్లు వేసినట్లయితే మీ ప్రాంత అభివృద్ధిని మీరే దూరం చేసుకున్నట్లు అవుతుందని, ఎందుకంటే నిధులు తెచ్చుకొని అయిజ అభివృద్ధి చేసుకోవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సంపత్ కుమార్ అన్నారు.

ఐజలోనే ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్క గుడిసె కూడా కనిపించకుండా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 2,3,4,15,16 వార్డుల అభ్యర్థులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.