12 August, 2026 | 2:56 AM

జాతీయ ఆరోగ్య పథకం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

12-08-2026 12:28 AM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): జాతీయ ఆరోగ్య పథకం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో నిర్వహించిన శాంతియుత నిరసనకు జిల్లా సమితి నాయకులు, ఉద్యోగులు హాజరై సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, సర్వీసు సమస్యల పరిష్కారం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ప్రజారోగ్య వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బడితల రమేష్, ప్రధాన కార్యదర్శి మధుబాబు, కోశాధికారి కె. శ్రీను, కార్యనిర్వాహక అధ్యక్షుడు వెంకటేష్, సలహాదారు ప్రభాకర్, సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ గౌడ్, సామాజిక మాధ్యమాల బాధ్యుడు రాజు తదితరులు పాల్గొన్నారు.