12 August, 2026 | 8:31 AM

లైబ్రరీకి రూ.30 వేలతో పుస్తకాలు వితరణ చేసిన చైర్మన్

12-08-2026 12:27 AM

మహబూబాబాద్, ఆగస్టు11 (విజయక్రాంతి): పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఉద్యోగార్థుల కోసం మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి 30 వేల రూపాయల విలువైన పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో 30 వేల రూపాయల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన గ్రూప్ వన్, గ్రూప్ 2, ఎస్ ఐ, కానిస్టేబుల్స్, బ్యాంకు, జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల కోసం పోటీ పడే నిరుద్యోగులకు, అట్లాస్ ఇండియన్ పాలిటి, తెలంగాణ చరిత్ర ,భారత చరిత్ర ,

ఇంకా అనేక  పుస్తకాలు, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి  వితరణ చేశారు. ప్రతి పాఠకుడు ఈ కాంపిటీటివ్ పుస్తకాలను వినియోగించుకొని పోటీ పరీక్షల్లో విజేతలై తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తూ, సమాజాభివృద్ధికి దోహదపడాలని కోరారు..ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు విజేందర్, వీరేందర్, నరసింగం శ్రీనివాస్, మందుల రఘు, భూలక్ష్మి యాదమ్మ గ్రంథాలయ పాఠకులు గోపాల్ ,నవీన్,సురేష్ ప్రవల్లిక ,జ్యోతి , శారద తదితరులు పాల్గొన్నారు.