02-12-2025 01:56:24 AM
- కేసముద్రం మార్కెట్ టాక్స్ ఎగవేత..
- చార్జీల పేరుతో కోతలు
- ధరల్లో వ్యత్యాసం
- రైతులకుతీవ్రనష్టం
మహబూబాబాద్, డిసెంబర్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం వ్యవసాయ మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుండి నేరుగా వ్యాపారులు కొందరు కొనుగోలు చేస్తున్నారు. అయితే అధిక ధర ఆశతో రైతులను మభ్యపెట్టి ‘జెట్టి’ బేరం జోరుగా సాగిస్తూ, తెల్ల చిట్టీలపై క్రయవిక్రయ లావాదేవీలు ని ర్వహిస్తూ మార్కెట్ కు చెల్లించాల్సిన టాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అటు మార్కెట్ కు టాక్స్ ఎగవేత, ఇటు రైతులకు చార్జీల పేరుతో కోతలు పెడుతూ ఎడాపెడా దండుకుంటున్నారనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు పం డించిన వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా జెట్టి బేరంతో వాహనాలు తెచ్చిన వ్యవసా య ఉత్పత్తులను వే బ్రిడ్జి కాంటా పై తూకం వేసిన తర్వాత 30 కిలోలు తరుగు పేరుతో కోత పెడుతున్నారు.
అలాగే వాహనాల్లో తీ సుకువచ్చిన వ్యవసాయ ఉత్పత్తులను కాంట నిర్వహించిన తర్వాత క్వింటాల్లోకి మార్చి ఆ తర్వాత బస్తాల్లోకి లెక్క కట్టి హమాలీ, దడువాయి, కూలి చార్జీలు మినహాయించు కుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే రైతు నేరుగా పండించిన పంటను వాహనంలో తీసుకురాగానే వే బ్రిడ్జి కాంట వేసి అ నంతరం ట్రేడర్ వద్ద నేరుగా డంపింగ్ చేయించుకున్నప్పటికీ ఎవరూ పని చేయకుండా వారి పేరు మీద చార్జీలు ఇస్తున్నట్లు కోతలు విధించడం విశేషం.
అటు 30 కిలోలు తరుగు పేరుతో ఇటు చార్జీల పేరు తో మినహాయించుకొని రైతులకు కొందరు ట్రేడర్లు శఠగోపం పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం రెగ్యులేటర్ మార్కెట్ ఉన్నచోట మార్కెట్ బయట కొనుగోళ్లు జరపకుండా నియంత్రించాల్సిన పాలకమండలి, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తు న్నాయి.
దీనితో కొందరు వ్యాపారులు బాహా టంగానే తమ మిల్లులు, ట్రేడింగ్ కంపెనీల వద్ద నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా నిలువరించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మిల్లులు, ట్రేడింగ్ కంపెనీల వద్ద దడువాయిలను ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.
వాయిదాకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ బయట కొనుగోలు చేయడమే కాకుండా, కొందరు వ్యాపారులు రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను వాయిదా పద్ధతులు కొనుగోలు చేస్తున్నారు. వారం నుండి పది రోజుల తరువాత డబ్బులు చెల్లించే విధంగా రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ, మార్కె ట్ బయట కొనుగోలు నిర్వహిస్తుండడంతో అడిగేవారే లేరని వ్యాపారులు కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాయి దా పద్ధతిలో కొనుగోలు చేస్తే ఎవరైనా బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఇప్పటికే కొందరు వ్యా పారులు వాయిదా పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా చేతులెత్తేసిన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. దీంతో అప్పట్లో రైతులకు చెల్లించాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాయిదాల పద్ధతితో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
మార్కెట్‌లో వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించాలి
రైతుల సంక్షేమం, సరైన గిట్టుబాటు ధర లభించడానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మోసాలకు తావు లేకుండా పూర్తిగా ఆన్లైన్ విధానంలో వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి వ్యాపారులు ఖరీదు చేయడానికి సౌకర్యాలు ఉన్నా యి. రైతులు వ్యవసాయ మార్కెట్ బయట వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించి నష్టాల పాలు కాకూడదు. ఎవరై నా వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
గంటా సంజీవరెడ్డి, కేసముద్రం మార్కెట్, చైర్మన్