20-05-2025 03:06:19 AM
గుల్జార్‌హౌస్ ఘటనపై డీహెచ్ రవీందర్‌నాయక్
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద బాధితులను దవాఖానకు తరలించిన అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు లేవంటూ జరుగుతున్న ప్రచారాన్ని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్‌నాయక్ ఖండించారు. ఘటనా స్థలం నుంచి ఉదయం 6:25 గంటలకు అంబులెన్స్‌లో (టీఎస్08యూల్ 5682) తొలి పేషెంట్‌ను ఉస్మానియాకు తరలించామని ఆయన సోమలవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 8 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి పంపించామని వెల్లడించారు.
ఘటనా స్థలం నుంచి 15 మంది బాధితులను 108 అంబులెన్స్‌లలో ఉస్మానియా, కేర్, అపోలో, యశోద హాస్పిటల్స్‌కు తరలించామని చెప్పారు. ప్రతి అంబులెన్స్‌లోనూ ఆక్సిజన్ సౌకర్యం ఉందని స్పష్టంచేశారు. ఇలాంటి ఆపద సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం అనవసరమైన అపోహలు సృష్టించి, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబతీయొద్దని విజ్ఞప్తిచేశారు. అగ్నిప్రమాద ఘటన గురించి తెలిసిన మరుక్షణమే అప్రమత్తమయ్యామని, ఘటనా స్థలానికి డాక్టర్ల బృందాన్ని పంపించామని డీహెచ్ వెల్లడించారు.
క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు, స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి ఉస్మానియాలో సిద్ధంగా ఉంచామని తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. బాధిత కుటుంబ సభ్యుల పరిస్థితిని అర్థం చేసుకుని, వారికి మరింత అసౌకర్యం కలగకుండా వీలైనంత త్వరగా పోస్ట్‌మార్టం ప్రక్రియను పూర్తి చేశామన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్రకుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ సహా ఉన్నతాధికారులంతా ఉదయమే ఉస్మాని యా హాస్పిటల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించామని రవిందర్ నాయక్ తెలిపారు. అ న్ని అంబులెన్స్‌లలో ఆక్సిజన్ ఉందని, తప్పు డు ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తిచేశారు.