20-05-2025 02:59:44 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాద ఘటనను రాజకీయం చేయడం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సరికాదని, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ డైరెక్షన్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయ న గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి గల్లీ లీడర్‌గా వ్యవహించవద్దని హితవుపలికారు. ఘటన జరిగిన నిమిషాల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.
ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని, వారి ని బతికించేందుకు సీఎం కూడా ప్రయ త్నం చేశారన్నారు. ప్రమాద ఘటనస్థలికి సీఎం వెళ్లితే.. అక్కడ జరిగే సహాయ చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే అధికారులకు ఫోన్‌లోనే ఆదేశాలు ఇచ్చారని, సీఎం ఆదేశాల తోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మం త్రులు దామోదం రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో మేయర్ కూడా వెళ్లారని తెలిపారు.
ప్రమాద ఘటనపై కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రధానితో మాట్లాడాలని, లేదంటే నేరుగా సీఎం కు ఫోన్ చేసి సూచనలు కూడా ఇవ్వొచ్చన్నా రు. కిషన్‌రెడ్డి చేసిన భారత్‌మాత యాత్రలో పటాకులు కాల్చిన సమయంలో ఇద్దరు చనిపోయారని గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌లో పడి మరో వ్యక్తి మృతి చెందారన్నారు. అప్పు డు సీఎం రేవంత్‌రెడ్డి అయ్యో పాపమని వదిలేశారు. కిషన్‌రెడ్డి రాజకీయాలు మాని ప్రజలకు సేవ చేయాలని హితవుపలికారు.