07-10-2025 01:08:22 AM
రాజన్న సిరిసిల్ల,అక్టోబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించి ఇందిరా మహిళ శక్తి చీరల పేరిట మహిళలకు చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో సిరిసిల్ల నేతన్నలకు పని కల్పించాలని, సుమారు 64 లక్షల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్‌తో కలిసి సిరిసిల్ల పవర్‌లూమ్ పరిశ్ర మను మంత్రి సీతక్క పరిశీలించారు.
ఇందిర మహిళ శక్తి చీరల తయారీ ఎంతవరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధనసరి సీతక్క, ఆది శ్రీనివాస్ మాట్లాడారు. మహిళలకు ఎలాంటి ఆపద వచ్చిన మహిళలకు ఒక ధీమా మహిళా సంఘాల ద్వారా ఏర్పడుతుందన్నారు. మహిళ సంఘాల్లో వడ్డీలేని రుణాలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని అన్నారు. మహిళా సంఘంలోని మహిళలకు అర్హురాలైతే ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ముందస్తుగా లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇస్తున్నామన్నారు.
ఒక్కో జిల్లాలో ఆరు నుంచి ఏడు కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. మహిళ సంఘాల వారికి బ్యాంకు ద్వారా కూడా రుణాలు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో అందరూ బాగుంటారన్నారు. మహిళల సంతోషమే ఇంటి సంతోషమని తద్వారా ఆ ఊరు బాగుంటుందని దాంతో సమాజం సంతోషంగా ఉంటుందనే అంబేద్కర్ కలలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
రాష్ట్రంలో 64 లక్షల మహిళా సంఘాల సభ్యులు ఉన్నారన్నారు. ఈ నెలాఖరులోగా చీరలన్నీ అందించేందుకు చేనేత కార్మికులు సిద్ధంగా ఉన్నారన్నారు. నవంబర్‌లో ఈ చీరలను పంపిణీ చేస్తామన్నారు. బతుకమ్మ చీరల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. మహిళ సభ్యురాలికి లోను తీసుకొని దురదృష్టవశాత్తు చనిపోతే రెండు లక్షల బీమా సౌకర్యం, ప్రమాదవశాత్తు మరణిస్తే ౧౦ లక్షల ఇన్సూరెన్స్, ఇందిరమ్మ ఇళ్ల కోసం ముందస్తు లక్ష రూపాయల వడ్డీ లేని రుణం ఇలా మహిళలకు ఎన్నో రకాలుగా చేస్తున్నామని అన్నారు.
మహిళా సంఘాల్లో చేరడం ద్వారా ఆర్థిక స్వావలంబన ఉంటుందని, ప్రతి మహిళ మహిళా సంఘాలలో చేరాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ఇచ్చిన మాటను బీసీ బిడ్డ కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీ సూచన ల మేరకు కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించి ఇచ్చిన మాట ప్రకారం. అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకువచ్చి పంపించిన బిల్లును రాష్ట్ర గవర్నర్.
రాష్ట్రపతి వద్ద దాదా పు రెండు బిల్లులు రెండు నెలల నుంచి ఒక బిల్లు పెండింగ్‌లో పెట్టుకోవడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఉందని సీతక్క అన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమూల స్వరూప తిరుపతిరెడ్డి, చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, కాముని వనిత, గడ్డం నరసయ్య, టోనీ, లింగారెడ్డి, గోనె ఎల్లప్ప, కల్లూరి చందన, మడుపు శ్రీదేవి పాల్గొన్నారు.ర