25 August, 2026 | 2:59 AM

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

25-08-2026 12:00 AM

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ఆగస్ట్ 24: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సోమవారం నార్కట్ పల్లి మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య సంఘం భవనం, ఓపెన్ జిమ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.