21-07-2025 02:02:01 AM
శాకాహార రెస్టారెంటా? అని అడిగి మరీ బయటి నుంచి తెచ్చుకున్న చికెన్ తిన్న వైనం
లండన్, జూలై 20: ఇస్కాన్ ధార్మిక సంస్థ లండన్‌లో నడుపుతున్న ఓ శాకాహార రెస్టారెంట్‌లో ఒక ఆఫ్రికన్ వ్యక్తి మాంసాహారం తిన్నాడు. రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి ఇది శాకాహార రెస్టారెంటా? అని అడిగి మరీ తన బ్యాగులోంచి చికెన్ తీసి అక్కడే తిన్నాడు.
అతను తినడం మాత్రమే కాకుండా అక్కడున్న సిబ్బంది, కస్టమర్లకు చికెన్ తినమని ఆఫర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అతడు అక్కడే గందరగోళం చేస్తుండటంతో సెక్యూరిటీ వచ్చి బయటకు పంపేశారు. సిబ్బంది చెప్పినా అతను వినకపోవడం గమనార్హం.