calender_icon.png 21 July, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాన్‌పై కన్వర్ యాత్రికుల దాడి

21-07-2025 02:03:49 AM

  1. ఉత్తర్‌ప్రదేశ్ రైల్వే స్టేషన్‌లో ఘటన

ఏడుగురు కన్వారియాల అరెస్ట్

లక్నో, జూలై 20: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లా రైల్వే స్టేషన్‌లో రైలు టికెట్ కొనుగోలు విషయంలో వాగ్వా దం తలెత్తింది. దీంతో కన్వారియాలు (కన్వర్ యాత్రికులు) ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్‌పై దాడి చేశారు. ఈ కేసులో ఏడుగురు  కన్వారియాలను అరెస్ట్ చేసినట్టు రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) ఇంచార్జి ఇన్‌స్పెక్టర్ చమన్ సింగ్ తోమర్ తెలిపారు. రైలు టికెట్లు కొనే విషయంలో వాగ్వాదం తలెత్తడంతో కన్వారియాలు సీఆర్‌పీఎఫ్ జవాన్‌పై దాడి చేశారు. బ్రహ్మపుత్ర మెయిల్ ఎక్కేందుకు సిద్ధం అవుతున్న జవాన్‌పై కన్వారియాలు దాడి చేశారు.