calender_icon.png 26 December, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సభా సమయాన్ని పొడిగించాలి

31-07-2024 01:20:23 AM

స్పీకర్‌కు ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి

ఒకేరోజు 19 పద్దులపై చర్చకు అభ్యంతరం

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): అసెంబ్లీలో మంగళవారం ఒకే రోజు 19 పద్దులపై చర్చను అధికారపక్షం ప్రారంభించింది. దీనిపై మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే రోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సరికాదని అన్నారు. మరో సెషన్‌లోనైనా ఇలా జరగకుండా సభ్యులకు సమయమిచ్చేలా సభా సమయాన్ని 20 రోజులకు పొడిగించేలా చూడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.