26-12-2025 02:42:00 AM
ఈఎస్‌ఐ మందుల బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం రిక్తహస్తం
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): అప్పులతో ముందుకు సాగడం కష్టమనుకుందో.. ఏమో.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా తప్పులతోనే ముందుకు సాగిపోయేలా ప్లాన్ సిద్ధం చేసి అమలు చేస్తున్నట్టు కనపడుతోంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ఈఎస్‌ఐ)కి రెండు సంవత్స రాలకు సంబంధించిన బిల్లులను చెల్లించినట్టు పీఎంఓకేకు కేవలం టోకెన్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్పించి మస్కా కొట్టింది. అదేంటి.. పీఎంఓకు కూడా తప్పుడు సమాచారం పంపిస్తారా అనే అనుమానం రావచ్చు. మీ అనుమానం నిజమే.. అసలు విషయం తెలిస్తే.. ఔరా.. అంటూ మీరుకూ డా ముక్కున వేలేసుకుంటారు.
ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతియేటా సుమా రు రూ.250 కోట్ల వరకు ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలను నడిపించేందుకు నిధులు విడుదలవుతూ ఉంటా యి. ఈ నిధుల్లోంచి సుమారు 80 శాతం మందులు, డ్రగ్స్, సర్జికల్స్ లాంటివి కొనుగోలు చేస్తారు. మిగతా 20 శాతం వరకు నిధుల్లోంచి డిస్పెన్సరీల నిర్వహణ (అద్దె), కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలు తదితర అంశాలకు ఖర్చు చేస్తారు. దీనితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు నిధులను విడుదల చేయాలి.
ఇలా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు కావాల్సిన మందు లు, డ్రగ్స్, సర్జికల్స్ లాంటివి కొనుగోలు చేస్తారు. వీటిని సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న సప్లయర్స్ ఉంటారు. కావాల్సిన మందులను ఈ సప్లయర్స్ సరఫరా చేసి.. బిల్లులను రాష్ట్ర ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌కు పంపిస్తారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల నుంచి ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం (ఈఎస్‌ఐ) చెల్లిస్తుంది. ఈ ప్రాసె స్ అంతా పూర్తి కావడానికి 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది.
రూ.25 కోట్లు పెండింగులోనే..
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు మందులు, డ్రగ్స్, సర్జికల్స్‌ను సరఫరా చేసే కంపెనీలు ‘ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్’గా ఒక సంఘాన్ని స్థాపించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.25 కోట్ల వరకు మందులు, డ్రగ్స్, సర్జికల్స్‌ను ఈ అసోసియేషన్ పరిధిలో ఉండే మందుల సరఫరాదారులు ఈఎస్‌ఐకి సరఫరా చేశారు. అయితే ఆ బిల్లులు మాత్రం వీరికి ప్రభుత్వం నుంచి రాలేదు. దీనితో అనేకసార్లు అధికారులు, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అయినా స్పందన రాలేదు. బిల్లులు విడుదల కాలేదు.
బిల్లులు ఎంతకూ విడుదల కాకపోవడంతో.. ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి 1.7. 2024 నాడు లేఖ రాశారు. ఇందులో ఈఎస్‌ఐసీ రేట్ కాంట్రాక్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐ అసుపత్రులు, డిస్పెన్సరీలకు మందులు, డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేశామని.. ఇందుకు సంబంధించిన బిల్లులను మందుల సరఫరాదారులకు చెల్లించడం లేదని, ఇది ఇబ్బం దిగా మారిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన మంత్రి కార్యాల యం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. రిమార్క్స్ పం పించ మని సూచించింది.
టోకెన్ నెంబర్లతో సహా సమాచారం
కేంద్రం ప్రభుత్వం నుంచి.. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖతో రా్రష్ట్ర ప్రభుత్వం అల ర్ట్ అయ్యింది. 229 బిల్లులకు సం బంధించి రూ.24,99,68,517 మొత్తాన్ని చెల్లించామని స్పష్టంగా తెలిపింది. పైగా ఈ 229 బిల్లులకు సంబంధించి తాము విడుదల చేసిన బిల్లుల చెల్లింపు టోకెన్ల నెంబర్లను కూడా ప్రధాని కార్యాలయానికి అందించిన సమాచారంలో పేర్కొ న్నారు. అంటే ఒక్కో బిల్లుకు ప్రత్యేకంగా ఉండే టోకెన్ నెంబర్‌ను కూడా ప్రధాని కార్యాలయానికి అందించిన సమాచారంలో పొందుపర్చారు. ఇది 2024 చివరలో జరిగింది. మొత్తం చెల్లించాల్సిన 229 బిల్లుల్లో.. రూ.1.5 కోట్లనుంచి మొదలుకుని రూ.50 వేల వరకు ఉండడం గమనార్హం.
రిక్త‘హస్తం’
అయితే ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బిల్లులను విడుదల చేయలేదు. కే వలం టోకెన్ నెంబర్లను మాత్రం విడుదల చేసి.. బిల్లుల చెల్లింపును తాత్సారం చేసి చేతు లు దులిపేసుకుంది. దీనితో 2024 25 ఆర్థిక సంవత్సరం ముగిసి.. 2025 ఆర్థిక సంవత్సరం మొదలయ్యింది. అయినా ప్రభుత్వంలో ఉలుకూ.. పలుకూ లేకుండా పో యింది. ఉన్నతాధికారుల చుట్టూ తిరగ్గా.. తిర గ్గా.. కొత్త ఆర్థిక సంవత్సరంలో మరోసారి బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించించింది.
మరోసారి బిల్లులను దాఖలుపర్చమని కోరడంతో 2025 జూలైలో మరోసారి బిల్లులను పంపించారు. దీనితో మరోసారి టోకెన్ నెంబర్లతో రూ. 24.99 కోట్ల మొత్తానికి జాబితా తయారు చేశారు. అప్పటి నుంచి మళ్లీ పాతపాటే మొదలయ్యింది. టోకెన్ నెంబర్లు తప్పితే.. బిల్లులు మాత్రం రావడం లేదు. చూసిచూసి విసుగేసి.. ఆగస్టు 29న ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ తరఫున మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు.
ఇప్పటికే దాదాపు మూ డుసార్లు తాము లేఖలు రాశామని.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించకపోతే తాము మందులు, డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేయలేమంటూ ఆగ్రహి స్తున్నారు. ఏకంగా పీఎంఓకే రెండు సార్లు రాష్ట్రప్రభుత్వం మస్కా కొట్టడం కేవలం తెలంగాణ ప్రభుత్వానికే చెల్లుతోందని మందుల సరఫరాదారులు ఆరోపిస్తున్నారు. చెల్లించని బిల్లులనుకూడా.. చెల్లించామని ప్రధాని కార్యాలయానికి త ప్పుడు సమాచారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని కోరుతున్నారు.