calender_icon.png 26 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్ మావోయిస్టు కీలక నేత గణేశ్ ఉయికే మృతి

26-12-2025 02:34:24 AM

మరో ఐదుగురు హతం

  1. గణేశ్ ఉయికే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు 
  2. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం

భువనేశ్వర్/చర్ల, డిసెంబర్ 25: ఒడిశాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే అలియాస్ పాక హను మంతుతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘట నా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావో యిస్టులు సంచరిస్తున్నట్టు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు, ప్రత్యేక బలగాలు సంయుక్తంగా కూం బింగ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు తారసపడటంతో లొంగిపోవాలని బలగాలు హెచ్చరించాయి. అయితే, మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో భద్రతా దళా లు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో కార్యకలాపాలు సాగిస్తున్నాడని, పార్టీ చేపట్టిన పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నట్లు భద్రతా దళ అధికారులు పేర్కొన్నా రు.

ఈయన తలపై రూ.1.10కోట్ల రివార్డు ఉంది. ఈయనతో పాటు మృతిచెందిన మావోయిస్టులు బారి తలపై రూ.22లక్షలు, అమృత్‌పై 1.65లక్షల రివార్డు ఉందని, మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

నాలుగు దశాబ్దాలకు పైగా ఉద్యమంలో..

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హను మంతు అలియాస్ గణేశ్ ఉయికే స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం. హనుమంతు 1961లో పుల్లెంల గ్రామానికి చెందిన పాక చంద్రయ్య, ఎట్టెమ్మ దంపతులకు జన్మించారు. ఆరుగురి సంతానంలో హనుమంతు మొదటివారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెల్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. చండూరులో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ నల్లగొండలో చదువుతూ రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. 45ఏళ్ల క్రితం ఏబీవీపీ నాయకుడు  ఏచూరి శ్రీనివాస్ హత్యలో హనుమంతు కీలక పాత్ర పోషించారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి నక్సలైట్ ఉద్యమంలో చేరారు. 

అప్పటి నుంచి ఆయన ఇంటివైపు చూడలేదు. ఆయ న అమ్మ, నాన్న చనిపోయినప్పుడు కూడా రాలేదు. మావోయిస్టు పార్టీలో మండల కమిటీ నుంచి జిల్లా , రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి మూడు రాష్ట్రాలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. పాక హనుమంతు చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నారని ఆయన సోదరుడు తెలిపారు. హను మంతు తండ్రి సీపీఎం పార్టీలో పని చేశారు.

తండ్రి  కమ్యూనిజం భావజాలంతోనే చదువుకునే రోజుల్లోనే హనుమంతు ఉద్యమ బాట పట్టారు. 17ఏళ్ల వయసులో గ్రామాన్ని విడిచిన హనుమంతు 20ఏళ్లలోపే ఉద్యమంలో చేరి ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయన శరీరంపై కొన్ని గుర్తుల ఆధారంగా గుర్తించవచ్చని, ముఖ్యం గా ముక్కుపై పచ్చ ఆధారంగా మాత్రమే ఆయన్ను గుర్తించగలుగుతామని గ్రామంలోని కొందరు వృద్ధులు పేర్కొంటున్నారు. 

నక్సలిజాన్ని నిర్మూలిస్తాం

మావోయిస్టు రహిత భారత దేశమే కేం ద్ర ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఒడిశాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన ఒడిశా పోలీసులు, ఎస్‌ఓజీ, సీఆర్‌పీఎఫ్, బలగాలను హోమంత్రి అభినందించారు.  2026నాటికి దేశంలో నక్సలిజా న్ని సమూలంగా నిర్మూలిస్తామని హోం మంత్రి పునరుద్ఘాటించారు.

మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లేని పక్షంలో విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వే యదని స్పష్టం చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి ణ ఫలాలు అందాలంటే నక్సలిజం అంతం కావడం అత్యవ సరమన్నారు. ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు.