calender_icon.png 26 December, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట వాసులు మృతి

26-12-2025 11:01:51 AM

అమరావతి: వరస రోడ్డు ప్రమాదాలతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రహదారులు రక్తసిక్తమయ్యాయి. గుంటూరు జిల్లా(Guntur District) నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులను తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు(Suryapet District) చెందిన సుశీల (64), వెంకయ్య (70), మహేష్ (28)గా గుర్తించారు.

వారు తిరుపతి నుండి సూర్యాపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు ప్రమాదాల్లో తెలంగాణకు చెందిన ఏడుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న సౌత్ డీఎస్పీ భానోదయ(South DSP Bhanodaya), సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అధికారులు ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. 

: నల్లపాడు పీఎస్ పరిధిలోని అంకిరెడ్డి పాలెం దగ్గర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. మృతులు తెలంగాణకు చెందిన సూర్యాపేట వాసులుగా గుర్తింపు.. మృతదేహాలను జీజీహెచ్ కు తరలింపు..