26 March, 2026 | 2:58 AM

ఎంఐఎం ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలి

26-03-2026 01:14 AM
  1. అసెంబ్లీలో ‘వందేమాతరం’ గీతాలాపన జరుగుతుండగా వాకౌట్ చేయడమేమిటి?
  2. గవర్నర్ శుక్లాకు బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు వినతిపత్రం

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభలో జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలాపన జరుగుతుం డగా వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈమేరకు రాంచందర్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాకు బుధవారం వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా రాంచందర్‌రావు లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తిగా నిలిచిన వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం అంటే దేశా న్ని, జాతీయగీతాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. మజ్లిస్ నాయకుల కు భారత్ మాతా కీ జై అనడం రాదు, జై హిం ద్ అనడం రాదు కానీ జై పాలస్తీనా అంటారని ఎద్దేవా చేశారు.

వందేమాతర గీతం ఆలపించే సమయంలో వాకౌట్ చేయడం అంటే కేవలం సభా నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, జాతీయ గేయానికి, దేశానికి జరిగిన తీరని అవమానంగా భావించా లన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉం డి, జాతీయ చిహ్నాల పట్ల కనీస గౌరవంలేని ఎంఐఎం సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు. ఇది వారి సంకుచిత మనస్తత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు.

సభ గౌరవాన్ని, జాతీయ గేయం ప్రతిష్టను దిగజార్చి న ఎంఐఎం ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ గౌరవం కంటే ఏ రాజకీయ పార్టీ లేదా మతం ఉన్నతమైనవి కావని, ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు డా ఎన్ గౌతంరావు, వీరేందర్‌గౌడ్, శ్రీ వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డా కాసం వెంకటేశ్వర్లు, జయశ్రీ, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్‌వీ సుభాష్, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, పలువురు రాష్ట్ర అధికార ప్రతినిధులు ఉన్నారు.