14-08-2025 12:00:00 AM
వీధి కుక్కలు బెడదపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ, నోయిడా నివాస ప్రా ంతాల్లో వీధి కుక్కల్ని నిషేధించాలనేది అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వు. మితీమీరిన కుక్కకాట్లు, రేబిస్ కేసులు దృష్టిలో పెట్టుకొని నివాస ప్రా ంతాల నుంచి వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని, ఆరు నుంచి ఎనిమిది వారాల్లోగా ఈ పని పూర్తి చేయాలని ఢిల్లీ అధికారులను కోర్టు ఆదేశించి ంది.
ఢిల్లీ వీధుల్లోని దాదాపు 8 లక్షల కుక్కల్ని షెల్టర్లకు తరలించినపుడే పిల్లలు, వృద్ధులకు భద్రత ఉంటుందని, ఈ విషయంలో సెంటిమెంట్లకు తావు ఉండకూడదని కూడా జస్టిస్ జే.బీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం ఖరాఖండిగా చెప్పింది. కుక్కల్ని ఇ ష్టపడేవారైనా, మరెవరైనా ఈ విషయంలో పిటిషన్లు దాఖలు చేసినా తా ము పరిశీలించమని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
సోమవా రం నాటి ఈ ఉత్తర్వులపై సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు నిరసన వ్య క్తం చేస్తున్నారు. గత నెల ఢిల్లీలో కుక్కకాటు వల్ల ఒక బాలుడు మరణించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించినా, ఆ ఉత్తర్వు ఉన్న సమస్యను పరిష్కరించకపోగా.. అనేక కొత్త సమస్యలకు కారణ భూతమవుతుందని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. పెంపుడు కుక్కల్ని చాలా మంది తమ కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తుంటారు.
అవి వీధుల్లోకి వెళ్లడం కూడా సహజమే. అలాంటప్పుడు నివాస ప్రాంతాల్లో కుక్కలు కనిపించకూడదంటే, అది సాధ్యమయ్యే పని కాదని బీజేపీ నాయకురాలు, జ ంతువుల హక్కుల కోసం పోరాడే మేనక గాంధీ, సుప్రీంకోర్టు తీర్పును త ప్పుపడుతున్నారు. పారిశుద్ధ్యానికి కార్మకుల వలె కుక్కలు పనిచేస్తుంటాయని వాటిని మనష్యుల నుంచి దూరం చేస్తే పర్యావరణ సమతుల్యత దె బ్బతింటుందని మేనక వాదన.
1880 దశకంలో పారిస్‌లో కుక్కలు లే కుండా చేసినప్పుడు ఎలుకలు విజృంభించి ప్రజలకు పెద్ద బెడదగా మా రిన పరిస్థితిని ఆమె ఉదాహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తున్న ‘పెటా’ వంటి సంస్థలు, ఎన్జీవోల వాదన ఎలా ఉన్నా, దానిని స్వా గతిస్తున్నవారు ఉన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కే సులు నమోదైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఉదయం పూట, రా త్రి వేళల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు.. వీధుల్లో గుంపులుగా తిరిగే కు క్కల బారిన పడుతున్నారు. పలు నగరాల్లో చికెట్, మటన్ సెంటర్ల నుంచి వచ్చే వ్యర్థాలకు అలవాటు పడే కుక్కలు, చెత్త కుప్పల వద్ద చేరి దాడులు చేస్తున్న ఘటనలు కోకొల్లలు.
మున్సిపాలిటీల వద్ద తగిన నిధులు, సి బ్బంది కొరవడి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్‌లతో వీధి కుక్కల బెడదను అదుపులో పెట్టడం సాధ్యం కావడం లేదు. కుక్క కాట్లనే పరిగణలోకి తీసుకొని వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించడమూ పాలకులకు సాధ్యమయ్యే పనికా దు. సంక్లిష్టంగా మారిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను దేశమంతా అమలు చే యాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుంది? ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వీధి కుక్కల సంఖ్యను అదుపు చేస్తే సరిపోతుందని జంతు ప్రే మికులు చెబుతున్న పరిష్కారంవైపే న్యాయస్థానాలు దృష్టి పెడితే సరిపోతుందా? రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై దేశ వ్యా ప్తంగా చర్చ జరుగుతుండటంతో, ఈ విషయాన్ని పరిశీలించేందుకు సు ప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అంగీకరించడం ముదావహం.