calender_icon.png 19 August, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో విప్లవాత్మక మార్పు!

13-08-2025 12:00:00 AM

గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ పేద విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో ఉం చుకొని రాష్ట్ర ప్రభుత్వం సహా అధికార వ ర్గం, అన్ని జిల్లాల యంత్రాంగాలు  కలిసి వినూత్న ఆలోచనలతో, విప్లవాత్మకమైన మార్పులతో గురుకులాల్లో నూతన సెంట్రలైజెడ్ టెండర్ విధానాన్ని తీసుకురావా లనే యోచనలో ఉన్నాయి.

ఈ విధానం కింద మహిళలను ఆర్థిక శక్తిమంతులుగా తయారు చేయడం, గత అనుభవాల దృ శ్యా విద్యార్థులకు నాణ్యమైన డైట్, 1023 గురుకులాల్లో ఒకే విధమైన డైట్ ఉండే విధంగా నియమ నిబంధనలు, విద్యార్థులతో నడిచేలా మెస్ విధానాలు, ప్రిన్సి పాల్స్, టీచింగ్ స్టాఫ్‌కు ఒత్తిడి లేని పని విధానం, క్యాటరింగ్ సిబ్బందికి కనీస జీతాలివ్వడం, టెండర్లలో పారదర్శకత, మెస్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడనున్నాయి. ఒకవేళ ఈ విధానం విజయవంతమైతే దేశం మొత్తానికి ఇది దిశా నిర్దేశమవుతుందనడంలో అతిశయోక్తి లేదు. 

శాశ్వత పరిస్కారం దిశగా..

గత టెండర్ విధానాలకు భిన్నంగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 1023 గు రుకుల పాఠశాలలో  ఒకే రకమైన డైట్ విధానం  ఉండాలనే సంకల్పంతో గత నెల 18న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏ ర్పాటు చేస్తూ ప్రత్యేకమైన జీవో జారీ చే సింది. ఈ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఒక నోడల్ ఏజెన్సీ గా అన్ని గురుకుల పాఠశాలల్లో కామన్, యూనిఫామ్ ప్రొకర్మెంట్ ఉండే విధంగా మార్గదర్శకాలు రూ పొందించారు. గురుకుల పాఠశాల్లో నాణ్యతను తనిఖీ చేయడానికి డిస్ట్రిక్ డైట్ కమిటీ (డీడీసీ) ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ను డీడీసీ చైర్మన్‌గా నియమిస్తూ.. అదనంగా మరో 15 మంది సిబ్బందితో యూనిట్లను ఏర్పాటు చేశారు.

గురుకులాలకు కావాల్సిన ఫుడ్ ప్రొవిజన్స్, కూరగా యలు, పండ్లు, మాంసాహారం, పౌల్ట్రీ ధరలను ఖరారు చేసి టెండర్స్ పిలవడానికి డీడీసీకి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీడీసీ చైర్మన్ అయిన కలెక్టర్ వివరాలను పరిశీలించి టెండర్లకు ఆహ్వాని స్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం డీడీసీ ఖరారు చేసిన ధరలకు ఒప్పు కున్న వారికి లాటరీ పద్ధతిలో డ్రా తీసి ఈ నెల 28న తుది జాబితాను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన క్యాటరింగ్ విధానాలు అమల్లోకి రానున్నాయి. ఈ నూతన టెండర్ విధానం  వల్ల ప్రొవిజన్స్ విషయంలో జిల్లా మొత్తం ఒకే రేటు విధానం.. అదే విధంగా కూరగాయలు, పండ్లు, మాంసాహార విషయమై మండలం మొత్తం ఒకే రేటు రూపొందించడం వల్ల కామన్ డైట్ తప్పక అమలు చేసే అవకాశముంటుంది. 

గత అనుభవాల దృశ్యా..

గతంలో ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్ హాస్టల్స్, కేజీబీవీల్లో డైట్, కూరగాయలు, పండ్లు సరఫరా, క్యాటరింగ్ కాంట్రాక్టు ఫైనలైజేషన్ విధానం ఏదైనా.. డిస్టిక్ పర్చేసింగ్ కమిటీ (డీపీసీ) ఆధ్వర్యంలో పాఠశాలల వారీగా టెండర్లు పిలిచేవారు. ఈ పరిస్థితుల్లో కేవలం కొంతమంది మాత్రమే టెండర్ డిపాజిట్ కట్టి అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు వేసేవారు. ఈ విధానం వల్ల ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రేటు ఖరారయిన సందర్భాలే ఎక్కువ. దీంతో పాఠశాలల్లో ప్రిన్సిపాల్స్, మెస్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గతంలో టెండర్ల విధానంలో ఉన్న లోప భూయిష్టమైన నియమాలు, ఒక గురుకుల సొసైటీలో పూర్తిగా టెండర్లను పలాన వారికే ఇవ్వాలని నిర్దేశించిన దాఖలాలున్నాయి. అన్ని గురుకులాల్లో కామన్ డైట్ మెనూ కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్న దృశ్యా టెండర్‌లు పక్కదారి పట్టకుండా పకడ్బందీ కసరత్తులు చేపట్టారు. ఒకవేళ టెండర్‌దారుడు కొన్ని సందర్భాల్లో తాను అనుకున్న వస్తువులను సరఫరా చేయడంలో విఫలమైతే ఆయా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అతడిని ప్రశ్నించేలా అధికారాలు ఇవ్వనున్నారు. కామన్ డైట్ మెనూ అమలు చేసే విషయంలో  సప్లయర్ మోసం చేసే అవకాశం లేకుండా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. 

టెండర్లలో నూతన సంస్కరణలు 

గతంలో క్యాటరింగ్ టెండర్ విధానంలో స్కూలు ఒక యూనిట్ గా ఉండి.. ఒక్కొక్క పాఠశాలలో ఒక్కో రేటు ఉండేది. తక్కువ రేటుకు టెండర్ దక్కించుకోవడం.. నష్టాలు వస్తున్నాయన్న ఉద్దేశంతో గ్యాస్ కు బదులు కట్టెల పొయ్యిలు వాడటం,  తక్కువ మందితో ఎక్కువ పని చేసేలా ఒత్తిడి చేయడం గురుకులాల్లో సర్వసాధారణంగా కనిపించేది. అలాంటి వాటికి చెక్ పెడుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నూత న టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈసారి నూతన టెండర్ విధానంలో అన్ని పాఠశాలు, కళాశాలలకు విద్యార్థుల  సంఖ్యను బట్టి టెండర్లకు ఆహ్వానించనున్నారు.

ఎంతమంది విద్యార్థులకు ఎంత మ్యాన్ పవర్ ఉండాలనేది టెండర్ ఫామ్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు 200 మంది విద్యార్థులకు ఒక కుక్కు సహా ఇద్దరు హెల్పర్లు  తప్పక ఉండాల్సిందే. దీనికి 45వేలు ఫీజుతో టెండర్స్ ఖరారు చేయనున్నారు. ఈ నూతన విధానం వల్ల విద్యార్థులకు అటెండెన్స్ తగ్గిందనే సాకు చూపిస్తూ పనివాళ్లను తగ్గించే అవకాశముండదు. అంతేగాక పనిచేస్తున్న వారికి మినిమం టైం పేస్కేల్ కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. నూతన టెండర్ విధానంలో మండలంలో ఉన్న ఎన్ని పాఠశాలలకైనా టెండర్లు వేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాలకు 75 వేల రూపాయల డిపాజిట్  చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్‌ఏఎస్‌ఎస్‌ఐ ఫుడ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలి.

ఈ క్యాటరింగ్ కాం ట్రాక్టు టెండర్ విధానంలో జిల్లా, మండ ల, స్థానిక గ్రామాల మహిళా సమాఖ్యలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. అయితే టెండర్ల ఎంపిక విధానంలో పలు విధానాలను అనుసరించనున్నారు. ఈఎండీతో పాటు, రెండు సంవత్సరాల ఐటీ రిటర్న్స్, ఎఫ్‌ఏఎస్‌ఎస్‌ఐ లైసెన్సు, వార్షిక టర్నోవర్ వివరాలను పొందుపరిచిన వారిని అర్హులుగా గుర్తిస్తూ ఒక ఎంబావూ లిస్ట్ తయారు చేయనున్నారు. వీరితో పాటు  జీసీసీ, మండల మహిళా సమాఖ్య, జిల్లా మహిళా సమాఖ్యలకు అన్నింటినీ కలిపి లాటరి పద్ధతిలో టెండర్లను ఫైనలైజ్ చేస్తా రు.

టెండర్ దక్కించుకున్న వాళ్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద  1/5 వంతు డబ్బును డిమాండ్ డ్రాఫ్ట్  లేదా బ్యాంకు గ్యారంటీ లేదా ఆయా జిల్లా కలెక్టర్ పేరు మీద సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే టెండర్ అగ్రిమెంట్ ఫామ్‌ను ఇస్తారు. ఒకవేళ టెండర్ దారుడు సరైన క్వాలిటీ మెటిరీయల్ సరఫరా చేయడంలో విఫలమైతే వెంటనే డీసీసీ చైర్మన్ ఆయా టెండర్ దారున్ని రద్దు చేస్తారు. ఆ తర్వాత టెండర్ దక్కించుకోలేకపోయిన మిగతావారికి అన్ని విధానాలు అర్థమయ్యేలా వివరాలను పేర్కొంటారు. ఆ తర్వాత టెండర్ల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి కొత్త వారికి అవకాశం కల్పిస్తారు. 

మహిళా సాధికారత దిశగా..

ప్రభుత్వం అమలు చేయనున్న నూతన టెండర్ విధానం వల్ల రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల 50 వేల మంది విద్యార్థులకు నాణ్యతతో కూడిన కామన్ డైట్ అందే అవకాశం ఉంది. మహిళా సమాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మహిళా సాధికారత పెరుగుతుందని నిపుణులు అభిప్రా యపడుతున్నారు.  పారదర్శకంగా టెండర్ విధానం గురుకులాల్లో ఉండేటటువంటి మెస్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించొచ్చు.

ప్రభుత్వం ఈ విధా నాన్ని విజయవంతంగా కొనసాగించాల న్నా, మహిళా సమాఖ్యలకు ఆర్థిక పరిపుష్టి జరగాలన్నా అందుకు ఒకటే దారి. టెం డర్లు ఇవ్వడం ఒక్కటే కాకుండా వారికి ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ప్రతినెలా ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఒక టో తారీకు జీతాలు చెల్లిస్తున్నారో.. అదే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరముంది. గ్రీన్ చానల్స్‌ను ఏర్పాటు చేసి హాస్టల్స్‌కు, గురుకులాలకు  సంబంధించిన టెండర్స్ అందరికీ కూడా ఒక పలానా తేదీన బిల్స్ వస్తాయనే నమ్మకాన్ని కలిగించినప్పుడు ఈ నూతన విధానం విజయ వంతం అయినట్లే. ఈ విజయం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

వ్యాసకర్త సెల్: 9849268240