calender_icon.png 31 January, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేంకటేశ్వర కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

31-01-2026 12:00:00 AM

వనపర్తి, జనవరి 30 ( విజయక్రాంతి ) : ఘణపురం మండలం గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కా ర్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, శారదా రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కైంకర్యాలను నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ కార్యక్రమాలను వేద పండితులు ఎమ్మెల్యే దంపతులతో ప్రత్యేకంగా చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం వేద పండితులు దంపతులకు వేద ఆశీర్వాదాలు అందించారు. అనంతరం భక్తులతో కలిసి వారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, భక్తులు మహిళలు, యువకులు పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.