calender_icon.png 31 January, 2026 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 3లో సాధించిన కానిస్టేబుల్

31-01-2026 12:00:00 AM

సిద్దిపేట క్రైం, జనవరి 30: సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహితున్న ఎర్రవల్లి సందీప్ రెడ్డి ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూప్-3 ఫలితాలలో ఆడిటర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డిని టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూనే, పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సందీప్ రెడ్డిని సత్కరించి, సిద్దిపేట పోలీస్ యూనిట్ నుంచి విధులకు రిలీవ్ చేశారు. కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది  పాల్గొని సందీప్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎదుగుదలకు సహకరించిన అధికారులకు, తోటి సిబ్బందికి సందీప్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.