calender_icon.png 31 January, 2026 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్ట్ షాపులు బంద్ చేయాలని తీర్మానం

31-01-2026 12:00:00 AM

నిజాంపూర్ గ్రామంలో గలమెత్తిన మహిళలు 

సదాశివపేట, జనవరి 30: సదాశిపేట మండలం నిజాంపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని మహిళా లోకం గలమెత్తింది. గ్రామ మహిళల గ్రామ వెలుగు సమైక్య సంఘం మహిళలందరూ కలిసి గ్రామంలో బెల్ట్ షాపులు బందు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఈ యొక్క తీర్మానపత్రం గ్రామానికి చెందిన మహిళలు గ్రామ పంచాయతీ సెక్రటరీ కి ఓ లేఖను అందజేశారు. గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్న కొందరు మత్తుకు బానిసై సంసారాలను గుల్ల చేసుకుంటున్నారని దీనికి ప్రభుత్వ అధికారులు బెల్ట్ షాపులను బంద్ చేసి ప్రజలకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో కిరాణా షాప్ లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు గానీ పోలీసు అధికారులు కానీ పట్టించుకోవడంలేదని ఆ గ్రామ మహిళలు తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మద్యం విషయంలో మాత్రం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని గ్రామ సమైక్య సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు చేస్తున్నా బెల్ట్ షాపులను తక్షణమే బంద్ చేయాలని లేని పక్షంలో మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నిజాంపూర్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పాల్గొన్నారు.