calender_icon.png 19 January, 2026 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సతీష్‌రెడ్డి కప్ విజేత మనీ ఎలెవెన్ జట్టు

19-01-2026 12:00:00 AM

  1. రన్నర్స్‌గా లక్ష్మీపురం సతీష్ ఎలెవన్ జట్టు 

బహుమతులు ప్రదానం చేసిన మాజీ జడ్పిటిసి శ్రీలత, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి 

బూర్గంపాడు, జనవరి18 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో స్నేహితుని జ్ఞాపకార్ధం నిర్వహించిన సతీష్ రెడ్డి-2026 క్రికెట్ టోర్నీలో మని ఎలెవన్ బూర్గంపాడు జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మణి ఎలెవన్(బూర్గంపాడు), సతీష్ ఎలెవన్(లక్ష్మీపురం) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ చేసిన సతీష్ ఎలెవన్ జట్టు 14.2 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ అయింది.66 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మణి ఎలెవన్ జట్టు 13ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

మణి ఎలెవన్ జట్టు బౌలర్ బాబ్ల మూడు ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 4 వికెట్స్ తీసుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అనంతరం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి విజేతగా నిలిచిన బూర్గంపాడు మని ఎలెవన్ జట్టుకు రూ.25,000 నగదుతో పాటు ట్రోఫీని, రన్నర్స్‌గా నిలిచిన లక్ష్మీపురం సతీష్ ఎలెవన్ జట్టుకు రూ.17000 నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ యారం పున్నారెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ పాలం దివాకర్ రెడ్డి, పాటిబండ్ల ఆంజనేయస్వామి, పోతిరెడ్డి గోవిందర్ రెడ్డి, తాళ్లూరి శ్రీహరి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.