6 May, 2026 | 12:14 AM

ఉద్యమకాలంలోనే తెలంగాణ తల్లి

10-12-2024 02:09 AM

* చిత్రాన్ని గీసిన కళాకారుడు బీవీఆర్ చారి

* దాదాపు అదే రూపంతో ప్రభుత్వం విగ్రహ ఏర్పాటు 

నిర్మల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నిర్మల్‌కు చెందిన ప్రముఖ రూపశిల్పి బీవీఆర్ చారి రెండు దశాబ్దాల క్రితం 2001లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి చిత్రాన్ని గీశారు. బీవీఆర్ చారీ గీసిన చిత్రం స్వరూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆమోదించి ఆవిష్కరించింది. కాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా చారీ గీసిన తెలంగాణ తల్లి చిత్రాన్ని చూసి అభినందించి, ఆ చిత్న్రా తెలంగాణ తల్లిగా గుర్తించిన చివరి క్షణంలో కొన్ని మార్పులు  చేయించి రూపకర్తగా మరో వ్యక్తి పేరును ప్రకటించారు. దీంతో బీవీఎన్ చారి నిరాశకు గుర య్యారు. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆవిష్కరించిన విగ్రహం బీవీఆర్‌చారి గీసిన చిత్రాన్ని పోలీ ఉన్నది. ఎమ్మెల్సీ ప్రొపెసర్ కోదండరాం కూడా ఇదే అనడంతో చర్చనీయాంశం గా మారింది. దీంతో బీవీఆర్ చారి సంతోషం వ్యక్తం చేశారు.