calender_icon.png 10 May, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 20న జరుగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

10-05-2025 12:47:55 AM

మణుగూరు మండలం సదస్సులో జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ 

మణుగూరు మే 9 విజయక్రాంతి మే 20 తేదీన జరిగే సార్వత్రిక సమ్మె సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ జ రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మణుగూరులోస ఉప్పతల నరసింహారావు అధ్యక్షతన  సదస్సు నిర్వహిం చారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం నిసిగ్గుగా ప్రజా వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తున్నది,

ప్రజలను మతం ముసుగులో ముంచి ప్రజలపై అధిక బారాలు మోపుతున్నదని విమర్శించారు. కార్మికులు అనేక సం వత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాచి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడలను తీసుకొచ్చిందని వెంటనే లేబర్ కోడులను విరమించుకోవా లని,లేనిచో ప్రభుత్వము ప్రజా అగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. 

వ్యవసా యం దేశంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందనినేడు యావత నష్టాల్లో ఉన్న వ్యవసాయం సాగు చేయడానికి ముందుకు రావడంలేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చట్టం పార్లమెంట్లో పాములు చేయాలని డిమాండ్ చేశారు.  గ్రామీణ పేదలను ఎంతో కొం త ఆదుకుంటున్నా ఉపాధి హామీ  పథకానికి నిధుల్లో కోత పెడుతూ, పని దినాలు తగ్గిస్తున్నారని  దీని వల్ల గ్రామీణ పేదల  ఆదాయం కోల్పోతున్నారు.

ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిర సిస్తూ చేస్తున్న మే 20 సార్వత్రిక సమ్మెను పారిశ్రామిక కార్మికులు, అసంఘటిత కార్మికులు, రై తాంగము, వ్యవసాయ కూలీలు సమస్త  ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సత్ర పల్లి సాంబశివరావు. రంగా  మిడ్ డే మిల్స్ నాయకురాలు శైలజ. పద్మ అరుణ. మున్సిపాలిటీ నాయకులు సురేష్. హేమంతరావు. పాయం  సూరయ్య . కారం రమణ. కారం నాగేంద్ర .  తదితరులు పాల్గొన్నారు.