calender_icon.png 10 May, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అమృత్ మిత్ర’లతో అందంగా పట్టణాలు!

10-05-2025 12:46:32 AM

- మున్సిపాలిటీల సుందరీకరణకు శ్రీకారం

- మహిళా సంఘాల సభ్యుల భాగస్వామ్యం

- తాగునీరు, పారిశుద్ధ్యం బాధ్యతల అప్పగింత

సంగారెడ్డి, మే 9(విజయక్రాంతి): పట్టణాల సుందరీకరణలో మహిళల భాగస్వా మ్యం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్పోరేషన్లలో ఏర్పాటు చేసిన అ మృత్ మిత్ర పథకం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు మున్సిపాలిటీల్లో అమలు చే సేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.

ఇంటిని చక్కబెట్టినట్లే మహిళలను భాగస్వామ్యులను చేస్తే మున్సిపాలిటీలను కూడా చక్కదిద్దుతారని భావిస్తున్నారు. ఆమె మద్దతుతో పట్టణాలు అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకొని సరిది ద్దే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

చేయాల్సిన పనులు...

మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన అమృత్ మిత్రలు చేయాల్సిన పనులను ముందుగానే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసే నిధులతో చేపట్టే ప నులను పర్యవేక్షణ చేయాలి. రూ.2 నుంచి రూ.10 లక్షల వ రకు నిధుల వినియోగం కోసం ప్రాజెక్టును ఎంపిక చేస్తారు. సింగిల్ టెండర్ పద్దతి న స్వయం సహాయక సంఘాలకు పనులు అప్పగిస్తారు.

ఇలా సంవత్సరం లో రూ.30 లక్షల మేర నిధులు వెచ్చించి ప నుల నిర్వహణపై సంఘాలకు గ్రేడింగ్లు ఇస్తా రు. ప్రధా నంగా తాగునీటి సరఫరా, వినియోగం పర్యవేక్షించాలి. ఇందులో భాగంగా మీటర్ రీడింగ్, నీటి సరపరా, పన్నులు వ సూలు చేయాలి. తాగునీటి పరిశుభ్రత, పైపు ల లీకేజీలను సరిచేయించడం, పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ, మొక్కలు నాటడం, పట్ట ణ సుందరీకరణలో పాలుపం చుకోవాలి.

ఇందుకోసం పార్కుల్లో ఎప్పు డు ఆహ్లాదకరంగా చూడాలి. పట్టణంలో వాల్ పె యింటింగ్తో తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ మొదలైన అంశాలను తెలిపేలా అందమైన పెయింటిగ్ వేయించి ప్రజ ల్లో చైత న్యం తేవాలి.

ఈ పనులు చేసినందుకు అ మృత్ మిత్రలకు పారితోషికం అం దజేస్తా రు. అయితే నిధుల వినియోగం, స్వ యం సహాయక సంఘాలకు పని కల్పించడంతో పాటు పనికి తగిన పారితోషికం కూ డా ఇ వ్వడంతో సభ్యులు మరింత బాధ్యతగా పనిచేస్తారని అధికారులు చెబుతున్నారు. 

ఎంపిక ఇలా...

పట్టణాభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలు (మెప్మా) సహకారం, అమృత్ 2.0 నిధుల వినియోగం చేసేందుకు మున్సిపాలిటీల్లో అమృత్ మిత్రలను ఎంపిక చేయ నున్నారు. పట్టణంలోని జనాభా, స్వయం సహాయక సంఘాలు, అందులోసభ్యుల సం ఖ్యతో పాటు పేదలు నివసించే ప్రాంతాలు, అక్కడ ఉన్న వసతులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముందుగా అమృత్ సంఘాలను గుర్తిస్తారు. అందులో పనిచేసే టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు విభాగాల్లో పరిజ్ఞానం ఉన్నవారిని గుర్తించి అమృత్ మిత్రలను ఎంపిక చేస్తారు. 

ఇంకా గైడ్లెన్స్ అందలేదు.. గీత, పీడీ మెప్మా, సంగారెడ్డి

ఇప్పటి వరకు కార్పోరేషన్లలో ఉన్న అ మృత్ మిత్రల నియామకం ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా అమలు చేయాలని ఉన్న తాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. అ యితే ఇందుకు సంబంధించి గైడ్లెన్స్ రాలేదు.

ఉన్నతాధికారుల సూచనలతో సంఘా లు, సభ్యులను గుర్తించేందుకు సర్వే చేపడుతున్నాం. పట్టణాల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు అమృత్ మిత్రలు పనిచేస్తారు. తాగునీరు, పారిశుద్ధ్యం, సుందరీకరణలో పట్టణ ప్రజలు మరింత చైతన్యం అవుతారు.