12-05-2025 12:46:48 AM
శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏకలక్ష్మి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే11: కార్మికులు కొట్లాడి సాధించుకున్న 8గంటల పనిదినాల్ని తొలగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని దీనికి వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి చెరుకు ఏకలక్ష్మి పిలుపునిచ్చారు.ఆదివారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆసంఘం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను తొలగించి 4లేబర్ కోడ్ లను అమలుపర్చి కార్మికులకు 12గంటల పని దినాలు కొనసాగే విధంగా చూస్తుందని అన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా స్కీం వర్కర్లు,అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు అందజేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మండలంలోని అంగన్వాడీ టీచర్లు,ఆయాలకు సీఐటీయు సభ్యత్వాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భాస్కరమ్మ,అంగన్వాడి టీచర్లు,ఆయాలు ధనమ్మ,రాధ,విజయలక్ష్మి, పరమేశ్వరి, లింగమ్మ, ప్రభావతి, యశోద, సరస్వతి, సవిత తదితరులు పాల్గొన్నారు.