13-05-2025 02:37:58 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సోమవారం 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు టాప్ మార్కులు సాధించగా, అబ్బాయిల కంటే అమ్మాయిలే ఆధిక్యం సాధించారు. 10వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 93.60%, ఇది గత ఏడాది 93.12% కంటే స్వల్పంగా తగ్గింది. బాలికలు అబ్బాయిల కంటే 2.04 శాతం పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. 1.99 లక్షల మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ స్కోర్ సాధించగా, 45,000 మందికి పైగా విద్యార్థులు 95%, అంతకంటే ఎక్కువ స్కోర్ సాధించారు.
అయితే, 1.41 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్ కేటగిరీ కింద ఉంచబడ్డారు. వారు తిరిగి హాజరు కావాల్సి ఉంటుంది. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు దాదా 16 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. అందులో మొత్తం 88.39% మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే కంటే 6.40 శాతం పాయింట్లతో ముందంజల్లో ఉన్నారు. మొత్తం 1.15 లక్షల మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ స్కోర్ సాధించగా, 24,000 మంది విద్యార్థులు 95% అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఫలితాలను ప్రకటిస్తూ సీబీఎస్ఈ పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ మాట్లాడుతూ... ఈ ఏడాది పరీక్షలు సజావుగా జరిగాయని, వారి పనితీరుకు తాము అందరు విద్యార్థులను అభినందిస్తున్నామని పేర్కొన్నారు.