13-05-2025 01:48:22 PM
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యం తో ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తామని చెప్పడం మరోసారి యువతను మోసం చేయడమే అన్నారు. తుంగతుర్తి కార్యాలయంలో మాట్లాడుతూ... అట్టహాసంగా ప్రకటనలు గుప్పించి లక్షలాది నిరుద్యోగులకు ఆశ కల్పించి. దరఖాస్థులు సేకరించిన అనంతరం ఈ విధంగా ప్రకటన చేయడమనేది అన్నివర్గాల యువత ఆశలపై నీళ్లు చల్లిన చందంగా ఉందని అన్నారు.
సిబిల్ స్కోర్ ఉండాలి అనే పద్ధతిని వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మాయమాటలతో నిరుద్యోగ యువత ఓట్లను దండుకొని అధికారాన్ని పొందిన కాంగ్రెస్ ప్రభుత్వంచెప్పిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి మరచిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి చేసిన వాగ్దానం ప్రకారం ధరఖాస్తుదారులలో అర్హులైన యువకులందరికి యువ వికాసం స్కీమ్ వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు గుండాగానీ రాములుగౌడ్, గునిగంటి సతీష్ పాల్గొన్నారు.