calender_icon.png 13 May, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిఒక్కరూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నదే నా ఆకాంక్ష

12-05-2025 12:40:38 AM

  1. దేవుడ్ని కూడా అదే కోరుకున్నా

రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

శంకరగిరి తండాలో శిఖర, ధ్వజ ప్రతిష్టా మహోత్సవానికి హాజరు

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 11 (విజయక్రాంతి)ప్రతీ ఒక్కరూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నదే తన ఆకాంక్ష అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పే ర్కొన్నారు.  ఆదివారం నేలకొండపల్లి మండ లం శంకరగిరి తండాలో జరిగిన శ్రీ సీతారా మ లక్ష్మణ, ఆంజనేయ, శిఖర, ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...  ప్రజలందరూ ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ ఉన్న త శిఖరాలకు చేర్చాలని దేవుణ్ణి కోరుకున్న ట్లు తెలిపారు.  అనంతరం మంగాపురం తం డా తదితర ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించి, పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.