calender_icon.png 13 May, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన సమాచార శాఖ కమిషనర్లు

13-05-2025 03:41:21 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ (RTI) కొత్తగా నియమితులైన కమిషనర్లు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్టీఐ నూతన కమిషనర్లుగా నియమితులైన పీవీ శ్రీనివాస రావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు. తమను కమిషనర్లుగా నియమించినందుకు వారంతా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.