calender_icon.png 1 June, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు భరోసా సీఎం రిలీఫ్ ఫండ్

13-05-2025 01:43:33 PM

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ భూపతిరెడ్డి 

భూత్పూర్: నిరుపేదలకు ఎల్లప్పుడూ పేద, మధ్యతరగతి ప్రజలకు అభయహస్తం సీఎం రిలీఫ్ ఫండ్ అని మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్ భూపతిరెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు  భూత్పూర్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన గంగుల మన్యం రెడ్డి కి సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 60 వేల చెక్కును అందజేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంగుఆర్భాటాలు లేకుండా ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.