20-08-2025 12:00:00 AM
సీపీఎస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ
బూర్గంపాడు, ఆగస్టు 19,(విజయక్రాంతి): సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని పిఆర్ టియు ఉద్యోగాల సంఘం అధ్యక్షులు భాస్కర్ రావు అ న్నారు. మండలంలోని మొరంపల్లి బంజర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద పిఆర్టియు ఆధ్వర్యంలో సిసిఎస్ మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల భవిష్యత్తు రక్షణ కోసం ఓపిఎస్ అమ లు తప్పనిసరి అని పేర్కొన్నారు. బి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సిసిఎస్ మహాధర్నాను ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి మోహన్, ఉపాధ్యా యులు లక్ష్మీ గాయత్రి,రవి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.