calender_icon.png 20 August, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్

19-08-2025 11:46:10 PM

చౌటుప్పల్,(విజయక్రాంతి): చౌటుప్పల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రోజున సమర్థన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ డ్రైవ్ లో చౌటుప్పల్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 150 మంది అభ్యర్థులు పాల్గొనడం జరిగింది.

ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో హైదరాబాదు చెందిన యంగ్ ఇండియా, యాక్సిస్, పేటీఎం, జస్ట్ డయల్, మెడిప్లస్, ఎంఆర్ఎఫ్, టాటా ఎంటర్ప్రైజెస్, షాపర్ స్టాపర్, కంపెనీలకు చెందిన HR లు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 40 మంది అభ్యర్థులను ఎంపిక అయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ తరఫున ఆఫర్ లెటర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ కి ఎంపికైన అభ్యర్థులను కళాశాల ప్రిన్సిపాల్ బి.మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.