calender_icon.png 20 August, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిథిలావస్థలో చెరువుసింగారం బడి

20-08-2025 12:00:00 AM

  1. వర్షానికి కురుస్తున్న ప్రాథమిక పాఠశాల పైకప్పు
  2. భయందోళనలో విద్యార్థులు

బూర్గంపాడు, ఆగష్టు 19,(విజయక్రాంతి): ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తరగతి గదులు కురుస్తుండడంతో విద్యార్థు లు భయాందోళన చెందుతున్నారు. బూర్గంపాడు మండలంలోని చెరువు సింగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గది గోడ కూలిపోయి ఉండడంతో మంగళవా రం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ చదువును అభ్యసించవలసి వస్తుందని వాపోయారు.

గోడ కూలిన సమయంలో తరగతి గదిలో ఎవరు లేకపోవ డంతో ప్రమాదం తప్పిందన్నారు. ఓ పక్క ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని చెప్పటం తప్ప ఆచరణలో శూన్యమని ఈ సంఘటన ద్రువపరుస్తోంది. పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మొత్తం 32 మంది వి ద్యార్థులు చదువుతున్నారు.

అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టిం చుకోకపోవడంతో ఆ గదులలోనే ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నా రు. తక్షణమే పాఠశాలను సురక్షితమైన భవనానికి తర లించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భవనం నిర్మించి 40 ఏళ్లు..

చెరువు సింగారం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించి 40 సంవత్సరాలు గడుస్తుంది. అప్పట్లో పిల్లర్లు లేకుండా కేవలం గోడతోనే భవనాన్ని నిర్మించారు. చిన్నపాటి వర్షానికే గోడల నుంచి నిమ్ము వచ్చి నీరు తరగతి గదిలోకి రావడంతో విద్యార్థుల కష్టాలు అంతా ఇంతా కావు. ముఖ్యంగా వర్షాకాలంలో పాఠశాల తరగతి గదిలోకి నీళ్లు చేరుతున్నాయి. తక్షణమే సం బంధిత అధికారులు స్పందించి నూతన భ వనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా

చెరువు సింగారం పాఠశాల అప్పట్లో పిల్లర్లు లేకుండా కేవలం గోడతోనే భవనాన్ని నిర్మించడంతో చిన్నపాటి వర్షా నికే గోడల నుంచి నిమ్ము వచ్చి నీరు చేరుతుండంతో విద్యార్థులు ఇబ్బందు లు ప డుతున్న మాట వాస్తవమే.ఈ విషయమై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తాత్కాలికం గా గ్రామంలో ఉన్న అంగన్వాడి భవనానికి విద్యార్థులను పంపించి వారికి కావా ల్సిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

 ఎంఈఓ యదు సింహరాజు